పోలీసులపై కలప స్మగ్లర్ల దాడి
కడప జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోయారు. బాలుపల్లి అటవీ ప్రాంతం దాడి, ప్రతి దాడులతో దద్దరిల్లింది. స్మగ్లర్ల కోసం గాలిస్తున్న పోలీసులు, అటవీశాఖ అధికారులకు 30 మంది స్మగ్లర్లు కనిపించారు. వారిని పట్టుకునేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతూ పోలీసులు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఎదురు తిరిగిన స్మగ్లర్లు రాళ్లతో అధికారులు, పోలీసులపై దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించడంతో స్మగ్లర్లు పలాయనం చిత్తగించారు. ఒక స్మగ్లర్ ను మాత్రం పట్టుకోగలిగారు. స్మగ్లర్లంతా తమిళనాడుకు చెందిన వారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.